![]() |
![]() |

ఆలీతో సరదాగా షో ఇండస్ట్రీకి సంబందించిన ఫేమస్ పర్సన్స్ ని మనం ఇప్పటి వరకు చూసాం. కానీ ఇప్పుడు మొదటిసారిగా నాన్ మూవీ కేటగిరీలో ఈ షోకి వచ్చిన ఫస్ట్ గెస్ట్ పీవీ.సింధు. ఈ ఎపిసోడ్ లో సింధు ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. ఆలీ కూడా మద్యమద్యలో సరదాగా జోక్స్ వేసి నవ్వించారు. సింధుని ఆలీ ఎన్నో ప్రశ్నలు అడిగారు. అందులో ఒకటి " నువ్వు గ్రౌండ్ లోకి వెళ్ళేటప్పుడు మనసులో ఏ దేవుడిని స్మరించుకుంటూ ఎంటరవుతావు" అన్న ప్రశ్నకు "ఆల్ ఇన్ వన్ దేవుడా" అనుకుంటా అని నవ్వుతూ చెప్పింది సింధు. అంటే "దేవుడా గెలిపించు" అనుకుంటావా అని అడిగేసరికి సింధు నవ్వుతూ " దేవుడు అన్ని గెలిపించలేడు కదా, బాగా ఆడాలి, మంచిగా ఆడాలి" అని అనుకుంటాను అని జవాబిచ్చింది.
" నేనైతే షూటింగ్ కి వెళ్ళేటప్పుడు నమాజ్ చేసుకుని బయల్దేరతాను .. మరి నువ్వు గేమ్ ఆడడానికి వెళ్ళేటప్పుడు ఎవరిని ..అంటే అమ్మ, నాన్న, గురువు వీరిలో ఎవరిని ఎక్కువుగా మనసులో అనుకుంటావు..వీళ్ళెవరూ కాకపొతే నీ ఫేవరెట్ దేవుడు ఎవరు " అని ఆలీ అడిగేసరికి "ఫేవరేట్ గాడ్ అంటూ ఎవరూ లేరు..ఆడియన్స్ ని చూసేసరికి నాకు ఫుల్ జోష్ వచ్చేస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతో మంది నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు. ఐనా కూడా నాలో ఎక్కడో ఒక చోట ప్రెషర్ అనేది ఉంటుంది..అలాంటి టైంలో వెంకటేశ్వర స్వామిని, గణేషుడిని మనసులో తలుచుకుంటాను. అప్పుడు కాస్త రిలాక్స్ గా అనిపిస్తుంది. నేను ఎక్కువగా టెంపుల్స్ కి కూడా వెళ్తుంటాను..రీసెంట్ గా లాల్ దర్వాజా బోనాల సంబరాలకు కూడా వెళ్లాను" అని తన ఫేవరేట్ గాడ్స్ గురించి, తనలో ఉన్న దైవభక్తి గురించి ఈ షోలో చెప్పింది పూసర్ల వెంకట సింధు.
![]() |
![]() |